ఈడీ తాత్కాలిక డైరెక్టర్‌గా రాహుల్‌

ఈడీ తాత్కాలిక డైరెక్టర్‌గా రాహుల్‌

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాత్కాలిక డైరెక్టర్‌గా రాహుల్‌ నవీన్‌ నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన రాహుల్‌ రెగ్యులర్‌ డైరెక్టర్‌ నియమితులయ్యే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత ఈడీ డైరెక్టర్‌ సంజయ్‌కుమార్‌ మిశ్రా పదవీకాలం ముగిసింది. రాహుల్‌ ప్రస్తుతం ఈడీ స్పెషల్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.