Current Affairs
ఐసీసీ చైర్మన్ గా జైషా
- ఐసీసీ చైర్మన్ గా జైషా బాధ్యతలు స్వీకరించారు.
- జైషా భారత్ నుంచి ఐసీసీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తి
- ఐసీసీ కొత్త చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు.
- రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
- ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా(36) గుర్తింపు దక్కించుకున్నారు.
- జైషా ప్రస్తుతం బిసిసిఐ కార్యదర్శిగా ఉన్నారు.
- జైషా కంటే ముందు కేవలం నలుగురు భారతీయులు మాత్రమే ఐసీసీ అధ్యక్ష పదవిని చేపట్టారు.
- ఆయనకు ముందు జగ్ మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ( 2015-20) లు ఐసీసీ బాధ్యతలను చేపట్టారు.
- జే షా 2009లో తొలిసారిగా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్లో చేరారు.
- ఆ తర్వాత 2019లో బీసీసీఐకి అతి పిన్న వయస్కుడిగా సెక్రటరీ అయ్యాడు.