సూక్ష్మ రోబోను అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
ఇలాంటి 30వేల రోబోలు ఒక సూది మొనపై ఇమిడిపో తాయి. ఇంత చిన్నగా ఉన్నప్పటికీ కదలికల సామర్థ్యాన్ని కలిగి ఉండటం దీని ప్రత్యేకత.
ఇది కాంతి తరంగాలతో సులువుగా చర్యలు జరపగలదు. శరీర కణజాల నమూనాలు సహా నిర్దిష్ట ప్రదేశాలకు అలవోకగా చేరుకోగలదు. విస్పష్ట ఫొటోలు తీయగలదు. వైద్య అవసరాలు, భౌతిక శాస్త్రంలో అనేక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఏమిటీ రోబో? • డైప్రాక్టివ్ రోబోటిక్స్ అనే విధానం కోసం ప్రధానంగా ఈ రోబోను అభివృద్ధి చేశారు. దీనికి వెలుపలి నుంచి వైర్ల వంటి ఎలాంటి సాధనాల సంధానత ఉండదు. కదలికలు సాధించగల రోబోల విషయంలో కార్నెల్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రపంచ రికార్డును సాదించారు. గతంలో వీరు 40-70 మైక్రాన్ల రోబోను తయారుచేశారు. డైప్రాక్టివ్ రోబో 2-5 మైక్రాన్ల పరిమాణాన్ని కలిగి ఉంది. ఒక మైక్రాన్ అంటే.. మీటరులో 10 లక్షల వంతు. ఏం చేస్తుంది? • సాధారణ మైక్రోస్కోపు వీక్షించలేనంత విస్పష్ట చిత్రాలను ఈ రోబోతో పొందొచ్చు. • చిన్నపాటి ఆకృతుల్లో తలెత్తే ఒత్తిడిని కొల వగలదు. డీఎన్ఏపై పరిశోధనలు వంటి రంగాల్లో ఇది ఉపయోగపడుతుంది. • భవిష్యత్లో డ్రైప్రాక్టివ్ మైక్రోరోబోలు సమూ హంలా పనిచేస్తూ అత్యధిక రిజల్యూషన్తో కూడిన సూక్ష్మ పరిశీలనలకు వీలు కల్పిస్తా యని శాస్త్రవేత్తలు తెలిపారు. కణాలు, కణ జాలాలకు సంబందించి లోతైన పరిశోధన లకు సాయపడతాయని పేర్కొన్నారు. • వ్యాధి నిర్ధారణ ప్రక్రియకు సమర్థంగా చేప ట్టవచ్చు.