భారత క్రైస్తవ మతాచార్యుడు జార్జి జాకబ్ కు కార్డినల్ గా పదోన్నతి
కేరళకు చెందిన ఆర్చ్ బిషప్ జార్జి జాకబ్ కువాకడ్ నూతన కార్డినల్ గా నియమితులయ్యారు. రోమ్ లోని సెయింట్ పీటర్స్ బసిలికాలో నిర్వహించిన ఓ వేడుకలో జార్జి జాకబ్ కు పోప్ ఫ్రాన్సిస్ ఈ హోదాను, దీనికి సంబంధించిన ధ్రువీక రణ పత్రాన్ని ప్రదానం చేశారు. భారత్ లో ఈ ఉన్నత స్థాయి హోదా కలిగిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. కాథలిక్ చర్చిలో పోప్ తర్వాత స్థానంలో కార్డినల్స్ ఉంటారు.