ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కాలుష్య స్థాయి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజలు 11.9 ఏండ్ల జీవితకాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనం హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన వార్షిక సగటు కాలుష్య పరిమితి (5 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ మీటర్‌) కంటే ఢిల్లీలో కాలుష్యం చాలా అధికంగా ఉన్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌ (ఏక్యూఎల్‌ఐ) స్పష్టం చేసింది. అత్యంత తక్కువగా కాలుష్యం ఉన్నటువంటి పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో కూడా ప్రమాదకర కాలుష్య స్థాయి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే 7 రేట్లు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.