చంద్రుడిపై ఆక్సిజన్‌ ఆనవాళ్లు

చంద్రుడిపై ఆక్సిజన్‌ ఆనవాళ్లు

చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రజ్ఞాస్‌ రోవర్‌ చంద్రుడిపై ఆక్సిజన్‌ ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించింది. అలాగే చంద్రుడిపై సల్ఫర్‌ నిక్షేపాలు కూడా భారీగానే ఉన్నాయని తొలిసారిగా కనుగొన్నది.  చంద్రుడి ఉపరితలంలో అల్యూమినియం ( Al ), కాల్షియం (Ca), ఐరన్‌(Fe), క్రోమియం ( Cr), టైటానియం (Ti), మాంగనీస్ (Mn)‌, సిలికాన్ (Si)‌, ఆక్సిజన్‌ (O) ఉన్నాయని ప్రజ్ఞాన్‌ రోవర్‌ గుర్తించింది.  జాబిల్లిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు, అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకు లిబ్స్‌ ( లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌) అనే పరికరాన్ని ప్రజ్ఞాన్‌ రోవర్‌కు ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు.  ప్రజ్ఞాస్‌ రోవర్‌లో అమర్చిన లిబ్స్‌ పరికరాన్ని బెంగళూరుకు చెందిన ల్యాబరేటరీ ఫర్‌ ఎలక్ట్రో ఆప్టిక్స్‌ సిస్టమ్‌ డెవలప్‌ చేసిందని పేర్కొంది.