సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి విజయం

సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి  విజయం

సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి విజయం

సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మాజీ డిప్యూటీ ప్రధాని ధర్మన్ షణ్ముగరత్నం (66) గెలుపొందారు. 70.4శాతం ఓట్లతో విజయం సాధించారు. దీంతో సింగపూర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతికి చెందిన మూడో వ్యక్తిగా షణ్ముగరత్నం నిలవనున్నారు. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న హలీమా యాకోబ్ పదవీకాలం సెప్టెంబర్ 13తో ముగియనుంది.

గతంలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు సింగపూర్‌ అధ్యక్షులుగా పనిచేశారు. కేరళకు చెందిన దేవన్‌ నాయర్‌ 1981లో సింగపూర్‌ అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1985 వరకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన సెల్లపన్‌ రామనాథన్‌ 2009లో సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు భారత సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా ధర్మాన్‌ షణ్ముగరత్నం ఎంపికయ్యారు.

సింగపూర్‌లో జన్మించిన భారత సంతతికి చెందిన ధర్మాన్‌ షణ్ముగరత్నం 2001లో రాజకీయాల్లోకి వచ్చారు. పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ నుంచి రెండు దశాబ్దాలకు పైగా వివిధ మంత్రి పదవుల్లో పనిచేశారు. 2011 నుంచి 2019 మధ్య సింగపూర్‌ ఉప ప్రధానిగా పనిచేశారు.