కొటక్‌ బ్యాంక్‌ నుంచి వీడిన ఉదయ్‌

కొటక్‌ బ్యాంక్‌ నుంచి వీడిన ఉదయ్‌

బ్యాంకింగ్‌ రంగంలో విశేష అనుభవం కలిగిన ఉదయ్‌ కొటక్‌ అనూహ్యంగా కొటక్‌ బ్యాంక్‌ నుంచి వైదొలిగారు. ఉదయ్‌ కొటక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సంస్థ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. మరోవైపు, బ్యాంక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న దీపక్‌ గుప్తా డిసెంబర్‌ 31 వరకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గాను వ్యవహరించనున్నారు. 

1985లో  ముంబైలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభమైన సంస్థ..ప్రస్తుతం లక్ష ఉద్యోగులను కలిగివున్నది. 38 ఏండ్ల క్రితం బ్యాంకులో రూ.10 వేలు పెట్టిన వారికి ఇప్పుడు రూ.300 కోట్ల రాబడిని సృష్టించింది. కొటక్‌ బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా 25.76 శాతం వాటా ఉండగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు 41.54 శాతం వాటా ఉన్నది. అలాగే దేశీయ సంస్థలకు 19.4 శాతం వాటా ఉన్నది. దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకైన కొటక్‌ బ్యాంక్‌లో ప్రస్తుతం లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.