జింబాబ్వే మాజీ కెప్టెన్‌ హీత్‌ స్ట్రీక్‌ కన్నుమూత

జింబాబ్వే మాజీ కెప్టెన్‌ హీత్‌ స్ట్రీక్‌ కన్నుమూత

జింబాబ్వే మాజీ కెప్టెన్‌ హీత్‌ స్ట్రీక్‌ (49) కన్నుమూశాడు. జాతీయ జట్టు తరఫున 65 టెస్టులు, 189 వన్డేలు ఆడిన స్ట్రీక్‌.. ఫ్లవర్‌ సోదరులతో కలిసి జింబాబ్వే క్రికెట్‌ను ఉన్నత స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
వన్డేల్లో 2943 పరుగులతో పాటు 239 వికెట్లు ఖాతాలో వేసుకున్న స్ట్రీక్‌.. టెస్టుల్లో 1990 పరుగులు చేసి 216 వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండర్‌గా జట్టు కు ఎన్నో విజయాలు అందించిన హీత్‌ స్ట్రీక్‌.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం పలు జట్లకు కోచ్‌గానూ వ్యవహరించాడు. 1993-2005 మధ్య జింబాబ్వే తరఫున స్ట్రీక్‌ 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత బంగ్లాదేశ్‌, జింబాబ్వే జట్లతో పాటు ఐపీఎల్‌లో కోల్‌కతా, గుజరాత్‌ లయన్స్‌కు కోచ్‌గా సేవలందించాడు. అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినందుకు 2021, ఏప్రిల్‌లో అతడిపై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం విధించింది.