చంద్రుడిపైకి రాకెట్ ను ప్రయోగించిన జపాన్

చంద్రుడిపైకి రాకెట్ ను ప్రయోగించిన జపాన్

జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్‌ చేయడమే లక్ష్యంగా చేపట్టిన తొలి మూన్ ల్యాండర్ రాకెట్‌ను జపాన్ (Japan) ప్రయోగించింది. సెప్టెంబర్ 7న ఉదయం 8.42 గంటలకు జాక్సా టనేగషిమా స్పేస్‌ సెంటర్‌ (Tanegashima Space Center) ఉన్న యోషినోబు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి హెచ్‌-2ఏ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది మూన్ స్నిపర్ (Moon Sniper) ల్యాండర్‌ను చంద్రుడిపైకి మోసుకెళ్లింది. ఈ ల్యాండర్ నాలుగు నెలల్లో చంద్రుని కక్ష్యలోకి చేరుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే చంద్రుని ఉపరితలాన్ని తాకిన ఐదో దేశంగా జపాన్‌ చరిత్ర సృష్టించనుంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA), నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన పరిశోధన ఉపగ్రహాన్ని కూడా ఈ రాకెట్ మోసుకెళ్లింది.