సనాతన ధర్మ దినోత్సవంగా సెప్టెంబర్‌ 3

సనాతన ధర్మ దినోత్సవంగా సెప్టెంబర్‌ 3

అమెరికాలోని కెంటకీ సెప్టెంబర్‌ 3వ తేదీని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. యూ ఎప్‌ కెంటకీలోని లూయిస్‌విల్లే మేయర్‌ క్రెగ్‌ గ్రీన్‌బర్గ్‌ దీనిని ప్రకటించారు. కెంటెకీలోని ఒక హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేక కార్యక్రమం లో మేయర్‌ ఏటా లూయిస్‌విల్లేలో సెప్టెంబర్‌ 3న సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చిదానంద సరస్వతి, రిషికేష్‌, రవిశంకర్‌, భగవతి సరస్వతి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ జాక్విలిన్‌ కోల్‌మన్‌ తదితరులు పాల్గొన్నారు.