కేరళ రాష్ట్ర డీజీపీగా దర్వేష్

కేరళ రాష్ట్ర డీజీపీగా దర్వేష్

వైఎస్సార్‌ జిల్లా  పోరుమామిళ్లకు చెందిన షేక్‌ దర్వేష్‌ సాహెబ్‌ కేరళ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

పోరుమామిళ్ల పట్టణంలోని బెస్తవీధికి చెందిన దర్వేష్‌ ప్రాథమిక విద్య పోరుమామిళ్లలోనే పూర్తి చేశారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ ప్రైవేటు పాఠశాలలో, ఆరు నుంచి పది వరకు ప్రభుత్వ పాఠశాల, ఇంటర్‌ జూనియర్‌ కళాశాలలో చదివారు. డిగ్రీ, పీజీలను తిరుపతిలో పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ డీజీపీగా నియమితులయ్యారు.

ధర్వేష్‌ తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ వెనకవైపు ఉన్న బెస్తవీధిలో నివాసం ఉండేవారు. ఐఏఎస్ సాధించాలని పట్టుదలతో కష్టపడి సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యారు. మొదటిసారి ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కు సెలెక్ట్ కావడంతో దాన్ని వదులుకొని మరోసారి ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యారు. ఈసారి ఐపీఎస్ కేరళ క్యాడర్ గా సెలెక్ట్ కావడంతో కేరళ రాష్ట్రంలో తన ఉద్యోగాన్ని మొదలు పెట్టారు. పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు.