అంగార‌కుడిపై ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసిన నాసా మెషీన్

అంగార‌కుడిపై ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసిన నాసా మెషీన్

అంగార‌కుడి గ్ర‌హంపై ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసింది నాసా(NASA)కు చెందిన మోక్సీ ప‌రిక‌రం.  ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌లో ఉన్న మోక్సీ ప‌రిక‌రం ద్వారా.. మార్స్ గ్ర‌హంపై ఉన్న కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను విజ‌య‌వంతంగా ఆక్సిజ‌న్‌గా మార్చిన‌ట్లు నాసా తెలిపింది. మైక్రోఓవెన్ సైజులో ఉన్న‌ మార్స్ ఆక్సిజ‌న్ ఇన్ సిటు రిసోర్స్ యుటిలైజేష‌న్ ఎక్స్‌ప‌రిమెంట్ ప‌రిక‌రం 16వ సారి ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసిన‌ట్లు నాసా చెప్పింది.