శాంతినికేతన్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు

శాంతినికేతన్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు

భారతదేశ జాతీయ గీతం జనగణమన.. స్వరపరిచిన ఠాగూర్ ఇల్లు ఈ శాంతినికేతన్. భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన కేంద్ర బిందువు. పశ్చిమ బెంగాల్‌లోని బిర్ముమ్ జిల్లాలో ఉన్న శాంతినికేతన్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించింది. విశ్వకవి’ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఓ శతాబ్దం క్రితం ఇక్కడ విశ్వభారతి విద్యా సంస్థలను స్థాపించారు.  ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. భారతదేశంలోని 41 ప్రదేశాలను జాబితా కోసం పంపిచారు. సౌదీ అరేబియాలో సమావేశమైన వరల్డ్ హెరిటేజ్ కమిటీ 45వ సెషన్‌లో శాంతినికేతన్‌ను ఈ ప్రముఖ జాబితాలో చేర్చాలనే నిర్ణయం అధికారికంగా జరిగింది. శాంతినికేతన్‌ను రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి మహర్షి దేవేంద్రనాథ్ 1863లో పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో స్థాపించారు. తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వం వహించి విశ్వభారతి విశ్వవిద్యాలయంగా మార్చారు. భారతదేశంలోని 41 ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి.. 2021లో గంగావతి తాలూకాలోని హిరేబెంకల్‌లోని మౌర్యుల రాతియుగం ప్రాంతం యునెస్కో జాబితాలో చేర్చబడింది.