విదేశాలకు వలస వెళ్లడంలో భారత్ నెంబర్ 1

విదేశాలకు వలస వెళ్లడంలో భారత్ నెంబర్ 1

ప్రపంచంలో వలసలు వెళ‌ుతున్న దేశంలో భారత్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 లో వెల్లడించింది. అందులోనూ దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళే వారే అధికం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక నుంచి అధికంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 2005లో కేరళ, తమిళనాడు వలసల్లో ఉన్నత స్థానంలో ఉంటే 2012 నాటికి ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు చేటు కల్పించుకున్నాయి. అయితే 2015 అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం దక్షిణ భారతదేశం కంటే ఉత్తరాది వాళ్లే అధికంగా వలసకు అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 ను వెల్లడించింది. అందులో మన దేశం నుంచి 1.8 కోట్ల మంది వెళ్లి మొదటి స్థానంలో నిలిచింది. అందులోనూ UAEలో నివసిస్తున్న వారి సంఖ్య 34.71 లక్షలు కాగా అమెరికాలో 27.23 లక్షల మంది నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇతర దేశాలైన మెక్సికో 1.12 కోట్లతో రెండవ స్థానంలో నిలువగా.. రష్యా నుంచి 1.08 కోట్ల మంది పొరుగు దేశాలకు వెళ్లారు.